Navodayam, 29 నవంబర్ 2026: Nizamabad | వినాయక్ నగర్, నవంబర్ 29 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన తండ్రి కొడుకులపై సంబంధిత నిజామాబాద్ నార్త్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. నార్త్ రూరల్ పరిధిలోని నాగారం ప్రాంతంలో గల ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం సాయంత్రం సాలుంకి రత్నదీప్, అతని తండ్రి సాలుంకి దీపక్ అనే ఇద్దరు వ్యక్తులు న్యూసెన్స్ సృష్టించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు.
దీంతో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు వారికి పలుమార్లు సూచించినప్పటికీ, వారు పోలీస్ స్టేషన్ ఆవరణలో గొడవకు దిగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారు. ఈ ఘటనపై తండ్రి కొడుకులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని వారిని అరెస్టు చేశాం. నిందితుల ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.