Navodayam, 30 నవంబర్ 2026: నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఫస్ట్ హీరో విజయ్ మ్యూజిక్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే రెండు పాటలు చాలా సూపర్ హిట్ అయ్యాయి.
హీరోయిన్ ఆఫియా ఎంత అద్భుతంగా నటించిందంటే మీరందరూ తనని చాలా ఇష్టపడతారు. డైరెక్టర్ మురళి పేరు డిసెంబ ర్ 4 తర్వాత చాలా బలంగా వినిపిస్తుంది. ఈసారి బరాబర్ హిట్ ఇస్తున్నాను’ అని అన్నారు. నాని మాట్లాడుతూ.. ఆఫియా అద్భుతమైన నటి. రుక్మిణి పాత్రలో అద్భుతంగా చేసిం ది. ఈ సినిమా లో కృష్ణ పాత్రలో నితిన్ తప్ప మరొకరిని నేను ఊహించుకోలేకపోయాను. ఈ సినిమాను నేను ప్రొడ్యూస్ చేయకుండా నేరుగా థియేటర్లో చూసి ఉంటే, కచ్చితం గా చాలా పెద్ద ట్వీట్ రాసి, ఆ టీమ్ కు ఫోన్ చేసి, ‘నేను ప్రమోషన్స్‌కు ఏమైనా పనికొస్తానా?’ అని అడిగేవాడిని.
అలాంటి సినిమా ఇది‘ అని తెలిపారు. డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ.. నితిన్ ఫిల్మోగ్రఫీలో నా పేరు కూడా ఉండటం చాలా హ్యాపీగా ఉంది. కచ్చితంగా ఈ సిని మా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఆఫియా, నిర్మాత దీప్తి గంటా, శివ నిర్వాణ, వెంకీ అట్లూరి, రాహుల్ సాంకృత్య న్, శైలేష్ కొలను, దిల్ రాజు, వెంకట్ బోయినపల్లి, రామ్ జగదీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.