Navodayam, 30 నవంబర్ 2026: మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘కాకా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం సినిమా చివరి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను సృష్టించింది. మరోవైపు, సినిమా రిలీజ్ డేట్‌పై వస్తున్న ఊహాగానాలకు చిరంజీవి స్వయంగా చెక్ పెట్టారు. ముందుగా ప్రకటించినట్టుగానే ‘కాకా’ 2027 జనవరి 13న థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశారు.
సంక్రాంతి రిలీజ్‌ను మరోసారి ధృవీకరిస్తూ మెగాస్టార్ స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు ఉండదని అభిమానులకు, సినీ ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించినట్టుగా సినిమా ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. చిరంజీవి తన ఎక్స్ అకౌంట్ లో కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా ’కాకా ’లో మీ ముందుకు వస్తున్నాడు! ఈ సంక్రాంతికి ‘ఆటో జానీ’ సరికొత్త కోణంలో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఎదురుచూస్తున్నాను‘ అని పోస్ట్ చేశారు. ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేతా థామస్, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘కాకా’లో సరికొత్త ‘ఆటో జానీ’గా..