- నిజామాబాద్ ఎంపీ అర్వింద్
Navodayam, 26 నవంబర్ 2026: వినాయకనగర్, నవంబర్ 26: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లు త్వరలోనే ప్రజల ముందుకు వస్తున్నదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సంవిధాన్ దివస్ కార్యక్రమంలో ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు పార్లమెంటుకు ముందుకు వస్తాయని చెప్పారు.