Navodayam, 25 నవంబర్ 2026: Silver Medal | కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 25 : పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ హైస్కూల్ లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో పెగడపల్లి షనైన్ పాఠశాలలో చదువుతున్న మండ లాస్య పాల్గొని రాష్ట్రపథకం సాదించినట్లు కరస్సాండెంట్ నసీర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో లాస్యను బుధవారం అభినందించి, ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థులు చదువుతో పాటు సహపాఠ్య కార్యక్రమాలపై దృష్టిసారించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగిఉన్న అంతర్గత నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Silver Medal | అథ్లెటిక్స్‌లో లాస్య ప్రతిభ.. పోరాడి రజత పథకం సాధించిన షనైన్ విద్యార్థిని