Navodayam, 27 నవంబర్ 2026: అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ వేళ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాలను భారీ వర్షాలు, ఈదురుగాలులు, వరదలు ముంచెత్తాయి. దాదాపు 10 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 2,200కు పైగా విమానాలు ఆలస్యమవగా, 400కు పైగా రద్దయ్యాయి.న్యూయార్క్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా మేసీస్ థ్యాంక్స్ గివింగ్ పరేడ్‌ను తొలిసారిగా వాయిదా వేసి శనివారానికి మార్చారు. న్యూజెర్సీ, న్యూయార్క్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న వాహనదారులను రక్షించాల్సి వచ్చింది.
పలు రహదారులు, వంతెనలను మూసివేశారు. మరోవైపు ఇల్లినాయిస్, మిస్సౌరీల్లో భారీగా మంచు కురిసింది. మిస్సౌరీలోని సెయింట్ జెనీవీవ్లో 14 అంగుళాల మంచు నమోదైంది. వెంట్జ్విల్లేలో మంచు క్రీడల కేంద్రం పైకప్పు కూలిపోయింది. పశ్చిమ తీరంలో అధిక ఆటుపోట్లు, భారీ అలలతో కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించారు. రైళ్ల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా, గతంలో వరదలతో నష్టపోయిన ఫ్లోరిడాకు అధ్యక్షుడు ట్రంప్ విపత్తు సహాయ ప్రకటనపై సంతకం చేశారు.