Navodayam, 17 నవంబర్ 2026: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ వెంటిలేటర్‌పైకి వెళ్లిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఐసీయూలో ఉన్న విద్యావ్యవస్థ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిందని చెప్పారు. ఇంటర్ బోర్డును రద్దు చేయాలన్న నిర్ణయం తెలంగాణ విద్యార్థులకు స్థానికత అంశంలో నష్టం చేసే కుటిల యత్నమని కవిత ఆరోపించారు. తన గురువు చంద్రబాబు మెప్పు కోసం ఆంధ్రా ప్రజలకు మేలు చేసేలా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆంధ్రా విద్యాసంస్థలకు అనుమతిస్తే, అమలాపురంలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు హైదరాబాద్‌లో పరీక్ష రాసి స్థానికులుగా చెలామణి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “ఇంటర్ బోర్డు రద్దుతెలంగాణ విద్యపై ప్రభావం” అంశంపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ఓ హోటల్లో మంగళవారం రౌండ్ టేండ్ సమావేశం జరిగింది. కవిత ప్రారంభ, ముగింపు ప్రసంగాలు చేశారు. ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని వెంటనే
వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డును రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అడ్మిషన్లు తీసుకుంటున్నామని ఐఏఎస్ అధికారులు ప్రకటించారని కవిత గుర్తుచేశారు. ప్రజా విధానం ఆధారాలపై ఉండాలని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు. ఇంటర్ బోర్డు రద్దు వల్ల లాభమా, నష్టమా చెప్పకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. జాతీయ విధానంలో ఉందని మనమూ కొనసాగిద్దామనడం సరికాదని చెప్పారు. వాటాదారులతో చర్చించాలని సూచించారు. ఈ నిర్ణయంపై అనుమానాలు నివృత్తి చేయాలని సీనియర్ ఎడిటర్ కె. శ్రీనివాస్ అన్నారు. స్థానికత అంశంతోపాటు పదో తరగతి ప్రాధాన్యాన్ని తగ్గిస్తారా అని ప్రశ్నించారు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని మార్చే ముందు విసృ్తత చర్చ జరగాలని అన్నారు. ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ మధు సూదన్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు తెచ్చిన విధానాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకుంటున్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ పాపిరెడ్డి ఆరోపించారు.