Navodayam, 25 నవంబర్ 2026: 
తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో ఉన్న ఒక కేఫ్‌లో జరిగిన పార్టీ సందర్భంగా, 22 ఏళ్ల యువతిపై ఆమె సహోద్యోగులిద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలతో సహా మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితురాలు, నిందితులు ఒకే కేఫ్‌లో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి ప్రీత్ విహార్‌లోని సల్తనతే కేఫ్‌లో జరిగిన పార్టీకి బాధితురాలు తన సహోద్యోగులతో కలిసి హాజరైంది.
రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కేఫ్ మూసివేసినప్పటికీ, వారు లోపలే ఉండి మద్యం సేవిస్తూ, నృత్యం చేస్తూ గడిపారు. ఉద్యోగుల్లో ఒకరి దగ్గర కేఫ్ తాళం చెవి ఉండటంతో వారు లోపలే ఉండగలిగారు.
మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు పార్టీ కొనసాగింది. ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీ జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, మిగిలిన సహోద్యోగులు ఈ నేరానికి సహకరించారని బాధితురాలు ఆరోపించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు, నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
మంగళవారం తెల్లవారుజామున 5:45 గంటల ప్రాంతంలో బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కేఫ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
కేఫ్ నుంచి బాధితురాలు ఒక వాహనంలో, ఒక స్నేహితుడు, మరో ఇద్దరు మహిళలతో కలిసి బయలుదేరుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలాన్ని సేకరిస్తున్నారు.