Navodayam, 24 నవంబర్ 2026: మనతెలంగాణ / సిటిబ్యూరోః నగరానికి బాంబు బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మలక్‌పేట్, ఐఎస్ సదర్ పిఎస్‌ల పరిధిలో సోమవారం రాత్రి ఓయో హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఓయో హోటళ్లలో తనిఖీలు చేపట్టిన పోలీసులు హోటళ్లలో ఉన్న వారి వివరాలు తెలుసుకున్నారు. తనిఖీల్లో అనుమానస్పద వ్యక్తుల వివరాలను పరిశీలించారు. హోటల్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న అతిథుల గుర్తింపు పత్రాలు, రిజిస్టర్లు, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. నగరంలో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు , అనుమానస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు తనిఖీలు చేశామని మలక్‌పేట్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. హోటల్ యజమానులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించామని తెలిపారు.
ఓయో హోటళ్లలో పోలీసుల తనిఖీలు