Navodayam, 27 నవంబర్ 2026: 
ఒకప్పుడు బంగారు బాతుల్లా కనిపించిన ఐటీ ఉద్యోగులు ఇప్పుడు వారి ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. వచ్చే ఐదేళ్లలో సుమారు 2.5 కోట్ల మంది ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని నివేదిక తెలియజేస్తోంది. ఇదిలావుంటే జర్మనీ టెక్ ధిగ్గజం ఎస్ఏపి భారీ లేఆఫ్ లకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తక్కువలో తక్కువగా సుమారు 10 వేల మందికి ఉద్వాసన పలుకనున్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే చర్యలు మొదలయ్యాయనీ, ప్రపంచ వ్యాప్తంగా వున్న ఉద్యోగుల్లో సుమారు 9 శాతం మంది ఉద్యోగులపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.
ఎవర్ని తొలగించాలో గుర్తించాలని ఆయా విభాగాల ఉన్నతోద్యోగులకు లేఖలు పంపినట్లు సమాచారం. కాగా ఏఐ వచ్చాక ఐటీ ఇండస్ట్రీలో పెనుమార్పులు సంభవించాయి. కృత్రిమ మేధస్సుకు తగ్గట్లు తమ నైపుణ్యాలను పెంచుకుంటే తప్ప ఉద్యోగాలను నిలబెట్టుకోవడం కష్టతరం అని అర్థమవుతోంది.