Navodayam, 24 నవంబర్ 2026: మన తెలంగాణ/హైదరాబాద్: వారం పది రోజులు అసెంబ్లీలో మాట్లాడేందుకు తాను సిద్ధమని, అసెంబ్లీ ఏర్పాటు చేసి మైకులు కట్ చేయకుండా ఉంటే అన్నం తినకుండానైనా మాట్లాడేందుకు సిద్ధమని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
ఉరి వేయాల్సింది మమ్మల్ని కాదు.. నిన్ను (రేవంత్ రెడ్డి), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీయాలి అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగార్జున సాగర్‌కు పొక్క కొడుతుంటే కుంభకర్ణ నిద్రపోతున్నందుకు మిమ్మల్ని ఉరి తీయాలని హరీష్ రావు అన్నారు. దేవాదుల, సీతారామ నీళ్లు లిఫ్ట్ చేయకుండా మోసం చేసినందుకు, కుప్పంకు 700 కిలోమీటర్లు తీసుకుపోతుంటే మౌనంగా ఉన్నందుకు మిమ్మల్ని ఉరి తీయాలని హరీష్ రావు మండిపడ్డారు.