Navodayam, 19 నవంబర్ 2026: మన తెలంగాణ – సిటీ బ్యూరో: హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. అంబర్‌పేటలోని ఓ హోటల్లో మండీ బిర్యానీ తిన్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ నెల 15న కుటుంబ సభ్యులు హోటల్లో బిర్యానీ తిన్నట్లు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల్లో ఓ మహిళకు న్యూరో సంబంధిత సమస్య తలెత్తడంతో పరిస్థితి విషమించిందని సమాచారం. మెరుగైన వైద్యం కోసం బాధితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్‌కు కారణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.
మండీ బిర్యానీ తిని ఒకే కుటుంబంలోని 9 మంది ఆస్పత్రిపాలు!