షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 19 నవం 2026, 7:45 ఉద.
ఆరోగ్యం

మండీ బిర్యానీ తిని ఒకే కుటుంబంలోని 9 మంది ఆస్పత్రిపాలు!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 19 నవం 2026, 7:45 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
మండీ బిర్యానీ తిని ఒకే కుటుంబంలోని 9 మంది ఆస్పత్రిపాలు!

మన తెలంగాణ – సిటీ బ్యూరో: హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. అంబర్‌పేటలోని ఓ హోటల్‌లో మండీ బిర్యానీ తిన్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ నెల 15న కుటుంబ సభ్యులు హోటల్‌లో బిర్యానీ తిన్నట్లు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల్లో ఓ మహిళకు న్యూరో సంబంధిత సమస్య తలెత్తడంతో పరిస్థితి విషమించిందని సమాచారం. మెరుగైన వైద్యం కోసం బాధితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్‌కు కారణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.

#ఆరోగ్యం
మన తెలంగాణ – సిటీ బ్యూరో: హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. అంబర్‌పేటలోని ఓ హోటల్‌లో మండీ బిర్యానీ తిన్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది…