Navodayam, 25 నవంబర్ 2026: Insurance | హనుమకొండ చౌరస్తా : ప్రతీ ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని, బీమాతో బాధిత కుటుంబానికి కొండంత లభిస్తుందని జిల్లా సహకార అధికారి బడావత్ మోహన్ అన్నారు. హనుమకొండలోని గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు మోతపోతుల రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఆయన కుటుంబానికి బ్యాంకు నుండి ప్రమాద బీమా పథకం కింద మంజూరైన రూ.లక్ష పరిహారం చెక్కును నామినీ అయిన బాధితుడి భార్య రజితకు అందజేశారు.
ఈ సందర్భంగా బడావత్ మోహన్ మాట్లాడుతూ ఖాతాదారులకు బ్యాంక్ అందిస్తున్న ఇలాంటి బీమా పథకాలు ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తాయని అన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయత్రి బ్యాంకు అందిస్తున్న సేవలు, సామాజిక బాధ్యతను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మ్యాదరి సందీప్ కుమార్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.