Navodayam, 23 నవంబర్ 2026: బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రామాయణం’ మొదటి భాగం కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పడ్డ కష్టం, చేసిన త్యాగం గురించి బయటకొచ్చిన విషయాలు సంగీత ప్రియులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం దాదాపు 10 నుంచి 12 సినిమా అవకాశాలను వదులుకున్నానని ఆయన తాజాగా వెల్లడించారు.
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన రెహమాన్ ‘రామాయణం’ సంగీతం వెనుక ఉన్న మూడేళ్ల సుదీర్ఘ శ్రమను కళ్లకు కట్టారు. థీమ్స్, బాణీలు సిద్ధం చేయడానికి తమ బృందం మూడేళ్ల పాటు పనిచేసిందని.. కొన్ని ట్రాక్‌లను అయితే 12 నుంచి 13 వర్షన్ల దాకా మార్చి మార్చి కంపోజ్ చేశామని తెలిపారు. ముఖ్యంగా ‘రావణ తాండవ్’ పాట విషయంలోనే ఏకంగా 12, 13 వర్షన్లు చేసిన తర్వాతే అందరికీ నచ్చిందనీ, ఆతర్వాతే తుది రూపం కుదిరిందన్నారు.