Navodayam, 28 నవంబర్ 2026: మన తెలంగాణ న్యూస్డెస్క్: విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వచ్చిన పాఠశాల బస్సు కొండపై బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పిఠాపురం నుంచి పిక్నిక్ కోసం విద్యార్థులు కైలాసగిరికి వచ్చారు. ఈ క్రమంలో కొండపై ప్రయాణిస్తుండగా పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు బోల్తా పడటంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సులో ఉన్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు!