- జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు
- కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటంతో అధిక సంఖ్యలో తరలివెళ్తున్న జనం
Navodayam, 29 నవంబర్ 2026: Karimnagar | రాజన్న సిరిసిల్ల, నవంబర్ 29( నమస్తే తెలంగాణ) : కరీంనగర్ లోని అలుగునూర్ లో జరిగే దీక్షా దివస్ స్ఫూర్తి సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి భారీగా తరలి వెళ్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల పట్టణం, వేములవాడ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల నుంచి భారీగా తరలి వెళ్తున్నారు. దీక్షా దివాస్ స్ఫూర్తి సభ కోసం అన్ని మండల కేంద్రాల్లో పట్టణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి, అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించారు.
తెలంగాణను ఆమర దీక్షతో సాధించిన కెసిఆర్ ఫ్లెక్సీ చిత్రానికి పాలాభిషేకాలు చేశారు. దీక్షా దివస్ సభకు జై తెలంగాణ జై కేసీఆర్… జై జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ బస్సులలో వాహనంలో తరలి వెళ్లారు. గులాబీ జెండాలతో వినూత్న రీతిలో జజ్జనకర జనారంటూ ఉత్సాహంగా దీక్షా దివాస్ స్ఫూర్తి సభకు బయలుదేరారు. దీక్షా దివాస్ స్ఫూర్తి సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కావడంతో సిరిసిల్ల ప్రజానీకం మరింత ఉత్సాహంగా అధిక సంఖ్యలో స్ఫూర్తి సభకు తరలి వెళ్లారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రహదారులన్నీ కన్నారం వైపే మళ్లాయి.