Navodayam, 29 నవంబర్ 2026: జోగులాంబ గద్వాల – మన తెలంగాణ: జాతీయ రహదారి-44పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి సమీపంలో తుఫాన్ జీపును వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అదుపుతప్పిన జీపు డివైడర్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో జీపులో 15 మంది ప్రయాణిస్తుండగా, ఐదుగురు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి దర్శనానికి భక్తులు తుఫాన్ జీపులో బయలుదేరారు.
ఈ క్రమంలో జింకలపల్లి సమీపంలో జాతీయ రహదారి-44పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు జీపును ఢీకొట్టింది. దీంతో జీపు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న 15 మందిలో ఐదుగురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రమాదం
మరోవైపు జీపును ఢీకొట్టిన కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.