- నందిపహాడ్లో దుర్మార్గం
- నిడ్జింతలో ఇండ్లపైకి జేసీబీ
- స్థానికులు అడ్డుకోవడంతో తోకముడిచిన అధికారులు
- పాత జీపీ భవనం నేలమట్టం
- పరిహారం తేల్చాకే ఇండ్ల జోలికి రావాలని గ్రామస్తుల స్పష్టీకరణ
Navodayam, 27 నవంబర్ 2026: మద్దూర్/ కోస్గి, నవంబర్ 27 : సీఎం రేవంత్రెడ్డి ఇలాకా కొడంగల్లో బుల్డోజర్లు మళ్లీ విరుచుకుపడ్డాయి. కోర్టు ఆదేశాలున్నా పట్టించుకోకుండా నిత్యం ఏదో చోట కూల్చివేతలకు పాల్పడుతున్నారు. తాజాగా రోడ్డు అభివృద్ధి పేరుతో నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపహాడ్లో దిడ్డి పాపమ్మ ఆలయాన్ని కూల్చివేయగా, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చిన స్థలానికి సమీపంలోనే కొత్తగా ఆలయాన్ని నిర్మించాలని డి మాండ్ చేశారు.
నిడ్జింతలో రోడ్డు విస్తరణ పనుల పేరుతో బల్డోజర్లతో నిర్మాణాలు కూల్చేందుకు అధికారులు యత్నించగా.. స్థానికులు ప్రతిఘటించడంతో తోక ముడిచారు. అయినా పాత గ్రామ పంచాయతీ భవనాన్ని నేలమట్టం చేశారు. ఇదంతా అ ధికార పార్టీ గ్రామ ముఖ్యనేత ఇంటి రో డ్డు కోసమే చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇండ్లను కూల్చేస్తారని ఆందోళన చెందిన కోస్గి మండలం పోతిరెడ్డిపల్లివాసులు కోస్గి మున్సిపాలిటీ ని ముట్టడించారు.
మున్సిపల్ చైర్మన్ నరేందర్, డీఈ అంజిరెడ్డికి తమ గోడు చెప్పుకొన్నారు. పరిహారం తేల్చాకే పను లు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ వార్డులకు 33 ఫీట్ల రోడ్డు వద్దని.. 25 ఫీట్ల మేర తొలిగిస్తే చాలని సూచించారు. స్పందించిన డీఈ కూల్చివేతలకు ఇంకా సమయం ఉన్న దని, ఉన్నతాధికారులకు సమస్యను వివరిస్తానని చెప్పడంతో వారు వెనుదిరిగారు.