Navodayam, 26 నవంబర్ 2026: Stock Market Today: బుధవారం నాటి భారీ ర్యాలీ తర్వాత గురువారం (నవంబర్ 26, 2026) కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్స్ జోరు కొనసాగుతోంది. ఉదయం 8 గంటల సమయంలో గిఫ్ట్ నిఫ్టీ (GIFT Nifty) సుమారు 131 పాయింట్ల లాభంతో ట్రేడవడం ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ప్రత్యక్ష మార్కెట్ ప్రారంభమైన తర్వాత నిఫ్టీ 50 సూచీ ఒడిదుడుకుల నడుమ ఉదయం 10 గంటల సమయానికి 32 పాయింట్ల లాభంతో 25,851.90 వద్ద, ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో 130 పాయింట్ల స్థాయికి ఎగబాకుతూ కదలాడింది. ఈ సానుకూల మార్కెట్ ర్యాలీ వెనుక ప్రధానంగా నాలుగు కీలక అంశాలు దోహదపడుతున్నాయి. విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లు స్టాక్ మార్కెట్ కి ఊపునిచ్చింది.

Stock Market Today: అమెరికా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు
నవంబర్ నెలలో నిరంతరంగా పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం ఒక్కరోజే రూ. 4,479 కోట్ల విలువైన భారత ఈక్విటీలను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ. 4,018 కోట్ల పెట్టుబడులు పెట్టడం మార్కెట్‌కు బలమైన అండగా నిలిచింది. అలాగే గురువారం ఉదయం జపాన్ నిక్కీ 225 సూచీ 1.6 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.9 శాతం మేర లాభపడటం భారత మదుపర్లలో సానుకూల సెంటిమెంట్‌ను పెంచింది.ఇక అమెరికా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు నిలిచాయి. గత సెషన్లో తీవ్ర ఒడిదుడుకుల తర్వాత అమెరికా సూచీలు కనిష్ఠ స్థాయిల నుండి కోలుకోగా, డౌ జోన్స్ 0.33 శాతం లాభంతో ముగిసింది. గురువారం ఉదయం అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ సైతం లాభాల్లో ట్రేడవడం ఆసియా మార్కెట్లకు ఊతమిచ్చింది.