Navodayam, 26 నవంబర్ 2026: దోహా: ఆసియా రైజింగ్ స్టార్స్ క్రికెట్ టోర్నమెంట్లో ఇండియాఎ పోరాటం సెమీ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో శ్రీలంకఎ టీమ్ 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ 40, అభిషేక్ శర్మ 78లు శుభారంభం అందించారు. కెప్టెన్ తిలక్ వర్మ 53, షాబాజ్ అహ్మద్ 54 నాటౌట్ తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక అలవోక విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు లసిత్ 116, జయవర్దేనా 105 సెంచరీలతో జట్టును గెలిపించారు.
లంక చేతిలో ఘోర ఓటమి.. ఆసియా రైజింగ్ స్టార్స్ నుంచి భారత్ ఔట్