Navodayam, 25 నవంబర్ 2026: ఐటీ కారిడార్‌గా పేరున ప్రాంతమైన ఖాజాగూడలో 8500 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా బుధవారం కాపాడింది. మార్కెట్లో రూ. 70 కోట్ల వరకూ ఉంటుంది. వాహనాల కాలుష్యంతో నిండిపోతున్న ఈ ప్రాంతానికి ఆక్సీజన్ బ్లాక్‌గా ఉన్న ఈ పార్కు ఎంతో విలువైనది. 1974లో గ్రామ పంచాయతీ ఆమోదం పొందిన ఈ లేఅవుట్ మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 262 ప్లాట్లతో ఈ లేఅవుట్ ఏర్పాటు చేశారు. లేఅవుట్లో రెండు ఓపెన్ స్పీస్ల కోసం మొత్తం 5,870 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో 700 చదరపు గజాల స్థలంలో ఆలయాన్ని నిర్మించారు. మరో 1,000 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా ఆ వివాదం కోర్టులో ఉందని అక్కడి ప్లాట్ల యజమానులు తెలిపారు. ఇక మిగిలిన 3500 గజాల స్థలం
కూడా కబ్జాకు ప్రయత్నాలు జరుగుతు న్నాయని హైడ్రా ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. సంబంధిత కాజలతో క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పార్కు కోసం కేటాయించిన స్థలంగా నిర్ధారించుకుంది. ఈ మేరకు బుధవారం పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డు ఏర్పాటు చేసింది. లేఅవుట్లో లోని ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన ఓపెన్ స్పీస్లను కాపాడటంపై ఖాజాగూడలోని సాయి ఐశ్వర్య ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్లాట్ యజమాములు హర్షం వ్యక్తంచేస్తూ.. హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు. హైడ్రా వల్ల ఈ పార్కును కాపాడుకున్నామని వారు మురిచిపోయారు.