Navodayam, 21 నవంబర్ 2026: మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీపై ‘అసలైన పుస్తకం’ రాస్తానని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే తెలిపారు. సోనియా ఎలా మారుతి సంస్థ యజమాని అయ్యారో, నేషనల్ హెరాల్డ్‌ను ఎలా కొనుగోలు చేశారో బయటపెడతానన్నారు.
తన ఎక్స్ పోస్ట్‌లో గాంధీకి, మేనకా గాంధీకి మధ్య పోరాటం వెనుక అసలు కారణాలను వివరిస్తానన్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానికన్నా అతీతంగా సోనియా ఎలా వ్యవహరించారో తెలియజేస్తానన్నారు.
అప్పటి ప్రధానికి బదులుగా సోనియా తన కుటుంబంతో కలిసి చైనా ఒలింపిక్ పోటీలకు ఎందుకు వెళ్లారు? సీతారాం కేసరి ధోతి వెనుక కథ ఏమిటి? అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు, సోనియాకు మధ్య ఘర్షణ ఎందుకు జరిగింది? 1999లో ఏ కాంగ్రెస్ నాయకుడు ఆమెను మోసగించారు? ఇవన్నీ బయటపెడతానని చెప్పారు.
విదేశీ వనిత అయినప్పటికీ మారుతి కంపెనీలో 50 శాతం వాటాదారుగా ఉన్న సోనియా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారని దుబే పేర్కొన్నారు. 1970 నవంబర్ 21న సంజయ్ గాంధీ, సోనియా గాంధీ మారుతి టెక్నికల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని, సోనియా మాత్రం మారుతికి అసలైన యజమాని అని చెప్పారు.