Navodayam, 18 నవంబర్ 2026: అరకులోయ : అల్లూరి జిల్లాలోని అరకులోయ పరిధిలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. చొంపి సమీపంలోని హైవే బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం కనిపించడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
యువతి శరీరంపై గాయాల గుర్తులు ఉండటంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడేసి ఉంటారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. మృతురాలిని దుంబ్రిగూడ మండలం గుంటగన్నెల గ్రామానికి చెందిన కిలో మీనాగా గుర్తించారు. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి, యువతి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.