Navodayam, 25 నవంబర్ 2026: ‘ధురంధర్’ సినిమా ఫేమ్ సారా అర్జున్ తొలిసారి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఓ భారీ ప్రాజెక్ట్ను దక్కించుకుంది. కెరీర్ ఆరంభమే ఒక భారీ స్పై థ్రిల్లర్ కథాంశంలో నటించి మెప్పించిన సారా, ఈసారి తన వయసుకు తగ్గట్టు ఒక అద్భుతమైన మ్యూజికల్ లవ్ స్టోరీలో నటించబోతోంది. ఇది ఆషిఖి సినిమా రేంజులో ఉంటుందని అంటున్నారు. టైగర్ 3 (2023) చిత్రానికి దర్శకత్వం వహించిన మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. 2027 జనవరిలో పంజాబ్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.
మ్యూజికల్ లవ్ స్టోరీలో సారా అర్జున్…