Navodayam, 25 నవంబర్ 2026: సంతాన సాఫల్య కేంద్రాల్లో మహిళల అండాలను విక్రయిస్తున్న వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా సంబంధం ఉందని శాసనమండలి ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. అండాల విక్రయంలో కేటీఆర్ తన బాల్య మిత్రుడు గేదెల వెంకట సూర్య కిరణ్‌తో కలిసి కీలక పాత్ర పోషించారని అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తన ఆరోపణలపై సమాధానం చెప్పాలని కెటిఆర్ కు బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. గాంధీ భవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కెటిఆర్ పై తీవ్ర ఆరోపనలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన చిన్ననాటి మిత్రులైన సూర్య కిరణ్,
ప్రదీప్రెడ్డిల ఫొటోను విలేకరులకు చూపించారు. మహిళల అండాలను విక్రయించిన కుంభకోణంలో కేటీఆర్ కూడా సూత్రధారి, పాత్రధారి అని, ఇది కేటీఆర్ చీకటి భాగోతమని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న గేదెల వెంకట సూర్య కిరణ్ కేటీఆర్‌కు బాల్య మిత్రుడని తెలిపారు. గేదెల వెంకట సూర్య కిరణ్, కేటీఆర్, జన్వాడ ఫామ్‌హౌస్ ప్రదీప్‌రెడ్డి చెడ్డీ దోస్తులని అన్నారు. సద్గురు హెల్త్ కేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కేటీఆర్ సతీమణి శైలిమ, వెంకట సూర్య కిరణ్ డైరెక్టర్లుగా ఉన్నారని బల్మూరి వెంకట్ ఆరోపించారు.