Navodayam, 23 నవంబర్ 2026: మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని హరీష్ రావు అన్నారు. ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి చేసిన ప్రతి ఆరోపణకు, ప్రతి అసత్య వ్యాఖ్యకు ఆధారాలతో సహా సమాధానం ఇచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు.
సాగర్ నీటి వివాదం: సిఎం హోదాలో ఇన్ని అబద్దాలా?.. రేవంత్ పై హరీష్ రావు ఫైర్