Navodayam, 28 నవంబర్ 2026: 
తిరుపరంకుండ్రం కొండపై శక్తివేల్ మురుగన్కి జై అంటూ భక్తుల జయజయధ్వానాల మధ్య కార్తీక దీపం వెలిగింది. ఈ దీప దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యేశ్వరుని దీప దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనయ్యారు. ఆనంద బాష్పాలతో కనులు నిండిపోయాయి. తిరుపరంకుండ్రం కొండపై, దీపతూన్ రాతి స్తంభం వద్ద శనివారం నాడు లాంఛనప్రాయంగా కార్తీక దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడ దీపం వెలిగించారు.
గురువారం నాడు దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు ఆ ప్రాంతానికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర బలగాలను ఆదేశించిన కొన్ని గంటల తర్వాత, కొండతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందిని ఇక్కడ మోహరించారు.
కాగా మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ‘దీపతూణ్’ వద్ద ఒకసారి మాత్రమే దీపం వెలిగించడానికి నవంబర్ 20న సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నవంబర్ 24న అక్కడ దీపం వెలిగించకపోవడంతో ఇప్పుడు ఈ చర్య తీసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలుపరచడంలో పోలీసులు విఫలమయ్యారనీ, ఆ బాద్యతను సీఆర్పీఎఫ్కి అప్పగించింది సుప్రీంకోర్టు.