తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారికి వర్ధమాన్ జైన్ దంపతులు భారీ బంగారు కానుక సమర్పించారు. సుమారు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి అందించారు. వాటితో ప్రత్యేకంగా 46 రకాల విభిన్న బంగారు ఆభరణాలను రూపొందించి శ్రీవారి సేవలో అర్పించారు. ధగధగలాడుతున్న ఆ ఆభరణాల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tirumala: తిరుమల శ్రీవారి రూ.206 కోట్ల బంగారు ఆభరణాలు ఇవే.. ఎలా ధగధగ మెరిసిపోతున్నాయో చూడండి.. ఫోటోలు