Navodayam, 26 నవంబర్ 2026: Nellore Road Accident: ఓటు వేసేందుకు వెళ్తూ ప్రమాదం. ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెంకటాచలం. ఓటు వేసేందుకు భార్యా భర్తలు తన కుమారుడు తో కలిసి తన స్వగ్రామం వెళ్ళతుండగా వెంకటాచలం మండలంలోని చెముడు గుంట జాతీయ దహదారి సమీపంలోనే సాయిబాబా గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు కనిగిరి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కొండారెడ్డి శ్రీనివాసులు రెడ్డి సతీమణి కోటేశ్వరి, కుమారుడు పవన్ తో కలిసి తమ కారులో బెంగళూరు నుండి స్వగ్రామమైన కనిగిరిలోనే కొత్తపాలెం కు బయలుదేరారు. ఉదయం ఐదు గంటల సమయంలో వెంకటాచలం మండలంలోని చెముడు గుంట సమీపంలో ఉన్న సాయిబాబా గుడి వద్దకు వచ్చేసరికే ముందు వెళ్తున్న లారీని కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా నుజ్జునుజ్జు అయినాయి. .కుమారుడు పవన్ కి తీవ్ర గాయాలు అయినాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంకటాచలం Nellore Road Accident: పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పక్కగా తీసి పోస్టు మాత్రం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్తపాలెం గ్రామంలో విషాదం కనిగిరి మండలం కొత్తపాలెం గ్రామంలో తమ బంధువులు ఓటు వేసేందుకు వస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు అటు గ్రామస్తులకు విషాదసాయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఓటు వేయకుండా మధ్యలోనే భార్యాభర్తలు దుర్మరణం చెందడం వాళ్ళ బంధువులు కన్నీరు మున్నేరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు..
