Navodayam, 25 నవంబర్ 2026: ఓ హత్య కేసులో బెయిల్ వచ్చిన నేపథ్యంలో కోర్టు బయటే నిందితుడిపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దారుణ సంఘటన పుణెలో చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం శివాజీనగర్ కోర్టులో న్యాయ విచారణకు హాజరైన నిందితుడు మందార్ కివ్డేపై కత్తితో దాడి చేసి, కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దుండగులు అతని ఒక చేతిని నరికివేసి పారిపోయినట్లు సమాచారం.
పూణే పోలీసుల ప్రకారం.. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పలువురు దుండగులు పదునైన ఆయుధాలతో కివ్డేపై దాడి చేసి రెండు స్కూటర్లపై పారిపోయారు. పోలీసులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది. ఘటనాస్థలం నుంచి రెండు తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసిన వారిని పట్టుకోవడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
నిందితులను గుర్తించామని, వారిని పట్టుకోవడానికి క్రైమ్ బ్రాంచ్,స్థానిక పోలీస్ స్టేషన్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్) గౌహర్ హసన్ తెలిపారు.