Navodayam, 25 నవంబర్ 2026: Dasyam Vinay Bhaskar | నా ఆఫీసు మీద గుడ్లు విసిరేయడం కాదు నాయిని రాజేందర్ రెడ్డి.. పక్కనే ఉన్న ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఇస్తే పౌష్టికాహారం దొరుకుద్ది కదా అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ఇటీవలే హనుమకొండలో కేటీఆర్ జన చైతన్య సభ మీటింగ్ విజయవంతం కావడంతో కాంగ్రెస్ జీర్ణించుకోలేక బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడేళ్ల నుండి ఆ విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వడం లేదు.
నాయిని రాజేందర్ రెడ్డి ఎన్ని రోజులు ఈ పాపపు పనులు, చిల్లర పనులు చేస్తావు.. బెదిరిస్తే భయపడమ న్నారు. కాంగ్రెస్ నాయకులకు సహకరిస్తూ చిల్లర కథలు పడుతున్న కొందరు పోలీసు అధికారులకు రిటర్న్ గిఫ్టులు ఉంటాయి జాగ్రత్త అని హెచ్చరించారు.