Navodayam, 23 నవంబర్ 2026: పిడుగుల్లారా పిట్టల్లారా
చినుకుల్లో చిత్తడిలో
చిందులు వేసే చిరుతల్లారా
ఆట స్థలాలుమోట బావులు
వెతికిన దొరకవు నగరపు దారిన
ఆటల్లేవు ఈతల్లేవు
చల్లని నీడల్లేవు తోటల్లేవు
పిల్లల కితకితల బుడతల పరుగుల
జాడల్లేవు వాడల్లేవు
పల్లెలలోన పట్నం లోన
గోడల నీడలు బాటల్లో ఆటలు
డబ్బులకు ఈత కొలను
ఆటల శిక్షణలు అందరికి అందవు
కొందరికి అందును నవ్వుల బాల్యం
ఆటల బాల్యం ఎదిగే బాల్యం
వెలుగుల మయం
కావాలి ఆనందమయం
బాల భారతపు భావి భారతపు
సూత్రధారులు పాలకులు
గురువులు మాతా పితలు
రేడియమ్
9291527757