Navodayam, 22 నవంబర్ 2026: దోహ: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భాగంగా భారత్-ఎ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్-ఎ జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఓపెనర్లు హుస్సేన్ (33), సదాఖత్ (59) శుభారంభం అందించారు తొలి వికెట్‌కి వీరు 66 పరుగులు జోడించారు. అయితే బదోనీ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కీపర్ నజీర్ (0) పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు.
ఈ దశలో హసన్ నవాజ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 82 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 79 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫర్హాన్ యూసుఫ్ కూడా రాణించాడు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు చేశాడు. మిగితా బ్యాటర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో పాక్ 49.2 ఓవర్లలో 313 పరుగుల చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే, విప్రాజ్ నిగమ్ తలో 2 వికెట్లు ఆయుష్ బదోనీ 1 వికెట్ తీశారు.