Navodayam, 22 నవంబర్ 2026: ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటాడు నటుడు వేణు ఎల్దండి. తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ అనే మరో క్రేజీ ప్రాజెక్టుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారు. ఇప్పుటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఆంధ్రప్రదేశ్‌లోని గండికోటలో మూడు రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ క్రమంలో దేవి శ్రీ గురించి వేణు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్‌ని చూశాక షాక్ అవుతారు. ఆయన 25 ఏళ్లుగా సంగీతంలో ముంచేసి మ్యాజిక్ చేశారు. ఇప్పుడు నటుడిగా అతనిలో అదే మ్యాజిక్‌ని చూస్తారు. దేవి నటన అంత బాగుంటుంది’’ అని డైరెక్టర్ వేణు తెలిపారు.
కాగా, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో పార్సి అనే కుర్రాడిగా ఆయన కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.