Navodayam, 22 నవంబర్ 2026: IND vs NZ 1st Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్యం వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్లకు 486 పరుగులతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్ దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో రిషభ్ పంత్ (128; 153 బంతుల్లో-10 ఫోర్లు-6 సిక్స్‌లు) దూకుడుగా ఆడుతూ శతకం నమోదు చేశాడు. ధ్రువ్ జురెల్ (78) రాణించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. జురెల్ ఔట్ అయిన తరువాత 720/9 వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 352 పరుగులకు చేరింది.
తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 368 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత టీమిండియా బ్యాటర్లు అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టారు. కేఎల్ రాహుల్ (136) సెంచరీ చేయగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98) రెండు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నాడు. యశస్వీ జైస్వాల్ (85), దేవ్‌దత్ పడిక్కల్ (80) రాణించారు. నాల్గోరోజు ఆటలో రిషబ్ పంత్ (128) సెంచరీతో అదరగొట్టాడు.. ధ్రువ్ జురెల్ (78) అర్ధ సెంచరీతో రాణించాడు. జురెల్ ఔట్ అయిన తరువాత 720/9 టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఇదిలాఉంటే.. తొలి టెస్టులో భాగంగా మూడు రోజుల ఆటలో భారత జట్టు పైచేయి సాధించగా.. నాలుగో రోజు ఆటలోనూ భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగించారు. మరోరోజు మ్యాచ్ మిగిలి ఉండటంతో టీమిండియా బౌలర్ల విజృంభిస్తే గెలుపు సునాయాసం అవుంతుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు.. న్యూజిలాండ్ గడ్డపై ఓ టెస్టు ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 2019లో బంగ్లాదేశ్ 715/6 స్కోర్ చేసింది. ఇక ఇదే వేదికపై వెస్టిండీస్ 2016లో 660/5 చేసిన స్కోర్ నూ టీమిండియా అధిగమించింది.