Navodayam, 22 నవంబర్ 2026: 
కర్నాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లాలో ఉన్న ఒక ఆస్పత్రిలో ఓ దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. ఆస్పత్రిలో మహిళా వార్డులో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దుండగుడు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో పాటు ఆస్పత్రిలోని మిగిలిన రోగులు, వారి అటెండర్లు లేచి దండగుడుని పట్టుకునేందుకు ప్రయత్నించలోపు అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
హవేరీలోని ఓ ఆస్పత్రిలో 109వ వార్డులో రోగి పక్కనే ఓ మహిళ నేలపై పడుకుని నిద్రిస్తోంది. ఇంతలో ఓ దుండగుడు దొంగతనం నెపంతో వార్డులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నిద్రిస్తున్న మహిళ వద్దకు చేరుకున్నాడు. ఆ మహిళ పక్కనే పడుకున్నట్టుగా నటించి, ఆమెను లైంగికంగా వధించాడు. అతడు అసభ్యంగా తాకడంతో మహిళ నిద్రలేచి అతడిని నిలదీసింది. ఈ లోగా అక్కడ ఉన్న ఇతర రోగులు, వార సహాయకులు మేల్కొనడంతో ఆ దండగుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.