Navodayam, 20 నవంబర్ 2026: 
ముంబై: బజాజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బజాజ్ ఏఎంసీ) ‘బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వ్యాపార చక్రాల ఆధారిత పెట్టుబడి థీమ్‌పై దృష్టి సారించే ఈ ఫండ్ ఒక ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ పథకం. వ్యాపార చక్రంలోని వివిధ దశల నుంచి ప్రయోజనం పొందగల సామర్థ్యం ఉన్న కంపెనీలను గుర్తించడం, అవకాశాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా వివిధ రంగాలు, పరిశ్రమల మధ్య పెట్టుబడుల కేటాయింపును సర్దుబాటు చేయడం ఈ ఫండ్ లక్ష్యం. ఈ ఫండ్‌కు సంబంధించిన న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) నవంబర్ 20, 2026న ప్రారంభమై డిసెంబర్ 4, 2026న ముగుస్తుంది.
పెట్టుబడి అవకాశాలు కేవలం ఒక వ్యాపారం నాణ్యతపైనే కాకుండా, ఆ వ్యాపారం ప్రస్తుతం తన వ్యాపార చక్రంలో ఏ దశలో ఉందనే అంశంపైనా ఆధారపడి ఉంటాయనే అవగాహనతో ఈ ఫండ్ పెట్టుబడి విధానాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు, రుణ కార్యకలాపాలు, వినియోగం, కమోడిటీలు, కంపెనీల ఆదాయాలు, మూలధన వ్యయాల్లో చోటుచేసుకునే మార్పులను ఫండ్ విశ్లేషించనుంది. వీటితో పాటు కంపెనీల విలువల అంచనా, ఇన్వెస్టర్ల మార్కెట్ సెంటిమెంట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త పెట్టుబడి అవకాశాలను గుర్తించేందుకు ప్రయత్నించనుంది.
ఫండ్ ప్రారంభం సందర్భంగా బజాజ్ ఏఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ మోహన్ మాట్లాడుతూ, “వ్యాపార చక్రాలు మారుతున్నప్పుడు, వివిధ రంగాల్లో కొత్త అగ్రగామి కంపెనీలు ఎదుగుతున్నప్పుడు పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఏర్పడుతుంటాయి. బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ సైకిల్ ఫండ్ క్రమశిక్షణతో కూడిన, వ్యాపార చక్రాలపై అవగాహన ఆధారిత పెట్టుబడి వ్యూహం ద్వారా ఈ మార్పులను అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మారుతున్న భారత వృద్ధి ప్రయాణంలో ఇన్వెస్టర్లు భాగస్వాములు అయ్యేందుకు అవకాశం కల్పించాలనుకుంటున్నాం,” అని తెలిపారు.
వివిధ రంగాలతో పాటు వాటిలోని పరిశ్రమల్లోనూ పెట్టుబడి అవకాశాల గుర్తింపు
బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ సైకిల్ ఫండ్ పెట్టుబడి విధానం కేవలం విస్తృత రంగాల ధోరణులకే పరిమితం కాదు. ఒకే రంగంలోని వివిధ పరిశ్రమలు తమ వ్యాపార చక్రాల్లో వేర్వేరు దశల్లో ఉండవచ్చనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, వాటిలోని పెట్టుబడి అవకాశాలను గుర్తించడంపై కూడా దృష్టి సారిస్తుంది.
ఉదాహరణకు, ఆటోమొబైల్ రంగంలో ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలకు సంబంధించిన పరిశ్రమల్లో డిమాండ్ పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. అదేవిధంగా, ఆర్థిక సేవల రంగంలో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), బీమా సంస్థలు వడ్డీ రేట్ల మార్పులకు వేర్వేరు రీతుల్లో స్పందించవచ్చు.
ఈ సందర్భంగా బజాజ్ ఏఎంసీ ముఖ్య పెట్టుబడి అధికారి (సీఐఓ) నిమేష్ చందన్ మాట్లాడుతూ, “వ్యాపార చక్రాలు మారుతున్నప్పుడు, వివిధ రంగాల్లో కొత్త అగ్రగామి కంపెనీలు ఎదుగుతున్నప్పుడు పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఏర్పడుతుంటాయి. బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ సైకిల్ ఫండ్ క్రమశిక్షణతో కూడిన, వ్యాపార చక్రాలపై అవగాహన ఆధారిత పెట్టుబడి వ్యూహం ద్వారా ఈ మార్పులను అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మారుతున్న భారత వృద్ధి ప్రయాణంలో ఇన్వెస్టర్లు భాగస్వాములు అయ్యేందుకు అవకాశం కల్పించాలనుకుంటున్నాం,” అని తెలిపారు.
వివిధ రంగాలతో పాటు వాటిలోని పరిశ్రమల్లోనూ పెట్టుబడి అవకాశాల గుర్తింపు
బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ సైకిల్ ఫండ్ పెట్టుబడి విధానం కేవలం విస్తృత రంగాల ధోరణులకే పరిమితం కాదు. ఒకే రంగంలోని వివిధ పరిశ్రమలు తమ వ్యాపార చక్రాల్లో వేర్వేరు దశల్లో ఉండవచ్చనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, వాటిలోని పెట్టుబడి అవకాశాలను గుర్తించడంపై కూడా దృష్టి సారిస్తుంది.
ఉదాహరణకు, ఆటోమొబైల్ రంగంలో ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలకు సంబంధించిన పరిశ్రమల్లో డిమాండ్ పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. అదేవిధంగా, ఆర్థిక సేవల రంగంలో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), బీమా సంస్థలు వడ్డీ రేట్ల మార్పులకు వేర్వేరు రీతుల్లో స్పందించవచ్చు.
ఈ సందర్భంగా బజాజ్ ఏఎంసీ ముఖ్య పెట్టుబడి అధికారి (సీఐఓ) నిమేష్ చందన్ మాట్లాడుతూ, “చాలా వ్యాపారాలు ఏదో ఒక రూపంలో ఆర్థిక లేదా రుణ చక్రాలతో అనుసంధానమై ఉంటాయి. అందువల్ల వాటి పనితీరుపై కూడా ఈ చక్రాల ప్రభావం ఉంటుంది. ఈ చక్రాలను సమర్థంగా అర్థం చేసుకునే ఇన్వెస్టర్లు, వ్యాపార చక్రంలో మందగమనం నెలకొన్న సమయంలో బలమైన కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన విలువల వద్ద లభించే పెట్టుబడి అవకాశాలను గుర్తించగలరు.
ఈ ఫండ్ ద్వారా విస్తృత ఆర్థిక పరిస్థితుల ఆధారంగా చేపట్టే టాప్-డౌన్ విశ్లేషణను, కంపెనీ స్థాయిలో నిర్వహించే బాటమ్-అప్ విశ్లేషణతో సమన్వయం చేయడం మా ప్రయత్నం. తద్వారా భవిష్యత్తులో వ్యాపారాలు, రంగాల్లో ఏర్పడే వృద్ధి అవకాశాల నుంచి ప్రయోజనం పొందేలా పోర్ట్‌ఫోలియోను రూపొందించాలని భావిస్తున్నాం.
సముద్రంలో రాబోయే తదుపరి అలను అందుకోవడానికి సర్ఫర్ ముందుగానే సరైన స్థానంలో సిద్ధంగా ఉన్నట్లే, విస్తృత మార్కెట్ దృష్టికి రాకముందే సంభావ్య పెట్టుబడి అవకాశాలను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం మా లక్ష్యం,” అని వివరించారు.
పెట్టుబడి ప్రక్రియలో ఇన్‌క్యూబ్ (INQUBE) కీలక పాత్ర
ఈ ఫండ్ పెట్టుబడి ప్రక్రియలో బజాజ్ ఏఎంసీకి చెందిన ప్రత్యేక పెట్టుబడి విధానం ‘ఇన్‌క్యూబ్’ ను ఉపయోగించనున్నారు.
ఈ విధానం మూడు ప్రధాన అంశాలను సమన్వయం చేస్తుంది. అవి సమాచార ఆధారిత ప్రయోజనం, పరిమాణాత్మక విశ్లేషణ ఆధారిత ప్రయోజనం, ప్రవర్తనా అవగాహన ఆధారిత ప్రయోజన.
ఈ మూడు అంశాలు వ్యాపార పరిస్థితులను సమగ్రంగా అంచనా వేయడానికి, డేటా ఆధారిత పెట్టుబడి నిర్ణయాల్లో క్రమశిక్షణను పాటించడానికి, పెట్టుబడిదారుల ప్రవర్తనకు సంబంధించిన పక్షపాత ధోరణుల ప్రభావాన్ని తగ్గించడానికి తోడ్పడతాయి.
ఫండ్ ప్రధాన వివరాలు
బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ సైకిల్ ఫండ్‌కు వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్ విభాగాలు, పెట్టుబడి శైలుల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది.
ఫండ్‌లోని ఈక్విటీ విభాగాన్ని సోర్భ్ గుప్తా, భరత్ హెగ్డే నిర్వహించనుండగా, ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగానికి సిద్ధార్థ్ చౌధరి బాధ్యత వహించనున్నారు.
ఈ పథకానికి బీఎస్ఈ 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్ (TRI) బెంచ్‌మార్క్‌గా ఉంటుంది.
ఈ పథకంలో రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే గ్రోత్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్‌డ్రాయల్ (IDCW) ఆప్షన్లు కూడా లభిస్తాయి.
ఇన్వెస్టర్ల సౌకర్యార్థం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP), సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP), సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (STP) సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
కనీస ప్రారంభ పెట్టుబడి మొత్తం ₹500. అదనపు పెట్టుబడులను ₹1 గుణిజాల్లో చేయవచ్చు. తదుపరి పెట్టుబడి దరఖాస్తులకు కనీస మొత్తం ₹100 కాగా, అవి కూడా ₹1 గుణిజాల్లో ఉండాలి.
యూనిట్ల కేటాయింపు తేదీ నుంచి మూడు నెలల్లోపు వాటిని రిడీమ్ చేసినా లేదా మరో పథకానికి స్విచ్ అవుట్ చేసినా, వర్తించే నికర ఆస్తి విలువ (NAV)పై 1 శాతం ఎగ్జిట్ లోడ్ విధించబడుతుంది. మూడు నెలల తర్వాత ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు.