Navodayam, 19 నవంబర్ 2026: అమెరికాలో విదేశీ ఉద్యోగులకు జారీచేసే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో నిబంధనలను కఠినతరం చేసేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఫిజికల్ థెరపిస్టులు, నర్సుల నుంచి అత్యంత నైపుణ్యం గల నిపుణుల వరకు వివిధ రకాల ఉద్యోగాల నియామకంలో తమ దేశ పౌరులకు ప్రాధాన్యం లభించేలా చూసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ కార్మికుల కోసం ఉద్దేశించిన ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల జారీకి యుఎస్ కఠినమైన నిబంధనలను ప్రతిపాదించింది.
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటి నిపుణులకు షాక్ ఇస్తూ ట్రంప్ యంత్రాంగం గ్రీన్ కార్డుల మంజూరు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల జారీలో కంపెనీలు ముందుగా అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వాలని, విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేసే కంపెనీలపై కొత్త నిబంధనలు విధించారు. పిఇఆర్‌ఎమ్ (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్) నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు, కొన్ని ప్రముఖ కంపెనీలు (ఐబిఎం వంటివి) వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను రద్దు చేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 18 నుండి కొత్త రూల్స్ అమలు చేయనున్నారు. ‘పబ్లిక్ ఛార్జ్’ వంటి నిబంధనలతోపాటు దరఖాస్తు విధానంలో మార్పులు తెచ్చారు. పెట్టుబడి ఆధారిత ఇబి-5 గ్రీన్ కార్డుల దరఖాస్తు ఫీజులను భారీగా పెంచారు. అమెరికాలో హెచ్-1బి నిబంధనలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డుల మంజూరులో విపరీతమైన ఆంక్షలు, చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనలకే డిపోర్టేషన్ చేస్తుండటంతో వేలాది మంది భారతీయ ఎన్‌ఆర్‌ఐలు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికా వెళ్లాలి, డాలర్లు సంపాదించాలి, అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోవాలని దశాబ్దాలుగా భారతీయ యువత, టెక్ నిపుణులు కనే ‘అమెరికన్ డ్రీమ్’ ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులు, ముఖ్యంగా తాత్కాలిక వర్క్ వీసాలపై ఉన్నవారు తీవ్ర అనిశ్చితిని, అభద్రతా భావాన్ని ఎదుర్కొంటున్నారు.
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు జారీచేసే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో నిబంధనలను కఠినతరం చేసేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఫిజికల్ థెరపిస్టులు, నర్సుల నుంచి అత్యంత నైపుణ్యం గల నిపుణుల వరకు వివిధ రకాల ఉద్యోగాల నియామకంలో తమ దేశ పౌరులకు ప్రాధాన్యం లభించేలా చూసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ కార్మికుల కోసం ఉద్దేశించిన ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల జారీకి యుఎస్ కఠినమైన నిబంధనలను ప్రతిపాదించింది. ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రక్రియలో భాగంగా లేబర్ మార్కెట్ పరీక్షను ఆధునీకరించడానికి అమెరికా కార్మిక శాఖ ఈ కొత్త నిబంధనను ప్రతిపాదించింది. గత 20 ఏళ్లలో ఈ నిబంధనలకు చేస్తున్న మొదటి ప్రధాన సవరణ ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఏళ్ల తరబడి ఎదురుచూసే గ్రీన్ కార్డు ప్రక్రియను అమెరికన్ వ్యవస్థ అత్యంత కఠినతరం చేసింది. దరఖాస్తుదారులపై స్క్రూటినీ స్థాయిలు విపరీతంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు నేరుగా దరఖాస్తుదారుల ఇళ్లకు వచ్చి విచారించడం, చుట్టుపక్కల వారిని ఆరా తీయడం పరిపాటిగా మారింది. దీనికి తోడు ‘పబ్లిక్ ఛార్జ్’ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. దరఖాస్తుదారులకు ఉన్న అప్పులు, క్రెడిట్ హిస్టరీ, రేపటి రోజున వారు ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆధారపడే అవకాశం ఉందా అనే కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం భారతీయులు సుమారు 179 సంవత్సరాల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికాలో విదేశీ ఉద్యోగులకు జారీ చేసే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో కఠినమైన నిబంధనలను తీసుకువచ్చే ఆలోచనలో అమెరికా ప్రభుత్వం ఉంది. ఉద్యోగాల నియామకాల్లో స్థానిక అమెరికన్లకు ప్రాధాన్యత లభించేలా ఈ కొత్త ప్రతిపాదనలు ఉన్నాయి. కుటుంబ ఆధారిత, ఉపాధి ఆధారిత, వైవిధ్యం లేదా పెట్టుబడి ద్వారా అమెరికాలో గ్రీన్ కార్డ్ దరఖాస్తులను ‘యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ పరిశీలించి మంజూరు చేస్తుంది.
పిల్లల భవిష్యత్తుపై సందిగ్ధం: హెచ్-1బి కొనసాగింపుపై నమ్మకం లేకపోవడం, గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు అడుగంటిపోతుండటంతో కుటుంబాలు, పిల్లలు ఉన్న భారతీయ నిపుణుల్లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. అభద్రతతో కూడిన జీవితాన్ని గడపడం కంటే, ఆర్థికంగా, పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి తిరిగి వెళ్లిపోవడమే మేలనే ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కాలనే ‘మాగా’ రాజకీయ భావజాలం పెరుగుతున్న తరుణంలో, రాబోయే రోజుల్లో లీగల్ ఇమ్మిగ్రేషన్ మరింత సంక్లిష్టంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది. స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న నెపంతో టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సిఎల్ వంటి దిగ్గజ ఐటి సంస్థలపై వేటు వేసింది. గ్రీన్‌కార్డ్ మంజూరు ప్రక్రియలో అత్యంత కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఈ సంస్థలను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటి రంగానికి అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ మంజూరు ప్రక్రియలో కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ అవుట్‌సోర్సింగ్ దిగ్గజాలను సస్పెండ్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలతో ఈ కఠిన చర్యలు చేపట్టింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ వంటి ప్రముఖ సంస్థలను సస్పెండైన లిస్ట్‌లో ఉన్నాయి. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని, ఇకపై ఈ సంస్థల నుంచి కొత్త పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను స్వీకరించబోమని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇస్కా రాజేష్ బాబు
93973 99298