Navodayam, 19 నవంబర్ 2026: మన తెలంగాణ – న్యూస్డెస్క్: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల సమీపంలోని ఐడిఎల్ కంపెనీ వద్ద లారీ ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నల్గొండలో లారీ ఢీకొని ఒకరు మృతి!