Navodayam, 18 నవంబర్ 2026: Balakrishna : తాజాగా ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మహి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అనేకమంది సెలబ్రిటీలు దీనిపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని ని ఉద్దేశించి బాలకృష్ణ గతంలో మాట్లాడిన ఓ వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ వీడియోలో బాలయ్య బాబు ధోని గురించి మాట్లాడుతూ.. 15 ఏళ్ళ క్రితం పసుపురంగు జెర్సీ ధరించి మన అందరి జీవితాల్లో ఓ సూర్యుడు ఉదయించాడు. ఆ నెంబర్ 7తో మనం కనెక్ట్ అయినప్పుడు జట్టులోకే కాదు నేరుగా మన గుండెల్లోకి ప్రవేశించాడు. తన ట్యాలెంట్ వల్లే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కూడా అతన్ని ఓడించలేకపోయింది. అతను వికెట్ల వెనుక మనం టీవీ సెట్ల ముందు ఆటని నడిపించాం. కొందరికి మహి, ఇంకొందరికి కెప్టెన్ కూల్. తర్వాత మన అందరికి తల అయ్యాడు.
ఎవరు ఆటకు కొత్త ఊపిరి అందించారో, ఎవరు అభిమానుల్లో కొత్త క్రేజ్ ని కలిగించారో.. ఆ కెప్టెన్, మన అభిమాన ఆటగాడు మన అందరికి గర్వకారణమయ్యాడు. మనల్ని గెలిపించిన వాడు, ఏడిపించిన వాడు, నవ్వించిన వాడు, కానీ ఓటమిని అంగీకరించడం మాత్రం నేర్పలేదు. మనమే కాదు మన ప్రత్యర్థులు కూడా ఆయన అభిమానులే. ఇవి ఆయన కొన్ని అద్భుత క్షణాలు. ఈ లెక్కలేనన్ని క్షణాలు అందించినందుకు ధన్యవాదాలు తల ఎల్లప్పుడూ 7 అని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు ధోని రిటైర్మెంట్ వేళ సరిగ్గా కుదరడంతో ఇపుడు షేర్ చేసారు. దీంతో ధోనికి బాలయ్య ఇచ్చిన ఎలివేషన్ అంటూ ఈ వీడియో వైరల్ గా మారింది.