Navodayam, 17 నవంబర్ 2026: తన తాత ఎన్టీఆర్ నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ ‘లవకుశ’ టైటిల్ కలిసొచ్చేలా ‘జైలవకుశ’ సినిమా చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తూ, మళ్లీ తాత ఎన్టీఆర్ టైటిల్ కలిసొచ్చేలా మరో సినిమా చేయనున్నారట తారక్. ఆల్‌టైమ్ క్లాసిక్ ‘దానవీరశూరకర్ణ’ టైటిల్ కలిసొచ్చేలా.. ‘దానవీరశూర’ పేరుతో తారక్ సినిమా చేయనున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఆ సినిమాకే ‘దానవీరశూర’ టైటిల్ అనుకుంటున్నారట. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివున్నది.