Navodayam, 29 నవంబర్ 2026: న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసే రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో రెండు కీలక బిల్లులను సోమవారం లోక్సభ పరిశీలించి, ఆమోదించనుంది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన సభా కార్యక్రమాల జాబితాలో మూడు బిల్లులను చేర్చారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు-2026తో పాటు డీలిమిటేషన్ (రెండో) బిల్లు-2026లను సభ పరిశీలన, ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ రెండో) బిల్లు-్ల-2026ను ప్రవేశపెడతారు.
పాత బిల్లుల ఉపసంహరణ.. కొత్త బిల్లుల ప్రవేశం
ఈ ఏడాది ఏప్రిల్ 16న లోక్సభలో ప్రవేశపెట్టిన అసలు డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. వాటి స్థానంలో సవరించిన కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటితోపాటు రాజ్యాంగ సవరణ బిల్లును కూడా తీసుకురానుంది.
డీలిమిటేషన్ బిల్లు లక్ష్యాలు
డీలిమిటేషన్ (రెండో) బిల్లు ద్వారా లోక్సభ, రాష్ట్రాల శాసనసభలు, కేంద్రపాలిత ప్రాం తాల శాసనసభల్లో మ హిళలకు రి జర్వేషన్లు అమ లు చేయడంతోపాటు, ఆ యా సభల్లో స్థా నా ల కేటాయింపు ల పునఃసర్దుబా టు, నియోజకవర్గాల పునర్విభజనకు వీలు కల్పించనున్నారు.
మూడు కేంద్రపాలిత ప్రాంతాలకూ మహిళా కోటా
కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు ద్వారా ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిల్లో మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు కు అవసరమైన మార్పులు చేయనున్నారు. ఇందుకోసం 1963 నాటి కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం, 1991 నాటి జాతీయ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ చట్టం, 2019 నాటి జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాలను సవరించనున్నారు.
మూడు బిల్లులపై కలిపి చర్చ
రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆధారపడిన మిగిలిన రెండు బిల్లుల పరిశీలన, ఆమోదానికి సంబంధించి లోక్సభ నిబంధనల్లోని రూ ల్ 66కు సంబంధించిన నిబంధనను నిలిపివేయాలని కోరుతూ మేఘవాల్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మూడు బిల్లులను విడివిడిగా కాకుండా కలిపి పరిశీలన, ఆమోదం కోసం సభ ముందుకు తీసుకురానున్నారు.