Navodayam, 18 నవంబర్ 2026: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఏవీ 2026లో విడుదల కాలేదు. అయితే 2027లో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రాగన్ సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నారు. మొదటి పార్ట్‌ను 2027 జూన్ 11న విడుదల చేయబోతున్నారు. రెండో పార్ట్‌ను 2027 డిసెంబర్లోనే విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకు ఎన్టీఆర్ సైతం రెడీ అన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ మిస్ అయితే 2028 సమ్మర్‌కు కచ్చితంగా డ్రాగన్ 2 ను విడుదల చేయడం ఖాయం.
ఒకవేళ డ్రాగన్ 2 సినిమా 2028 సమ్మర్‌కు వాయిదా పడితే రెండు పార్ట్‌ల మధ్యలో ఎన్టీఆర్ మరో సినిమాతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ఆ సినిమాను 2028 సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక 2027 జూన్ నుంచి 2028 సమ్మర్ వరకు ఎన్టీఆర్ నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. ఒకవేళ డ్రాగన్ సినిమా 2027 డిసెంబర్లో వస్తే కేవలం ఆరు నెలల గ్యాప్‌లో ఎన్టీఆర్ మూడు సినిమాలు విడుదల అవ్వనున్నాయి.
జూన్‌లో డ్రాగన్ 1, డిసెంబర్లో డ్రాగన్ 2, జనవరిలో ఎన్టీఆర్, -రావిపూడి సినిమాలు విడుదల కానున్నాయి. అంటే దాదాపు ఆరు నెలల కాలంలో ఎన్టీఆర్ నుంచి మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఒకవేళ డ్రాగన్ 2 సినిమా డిసెంబర్ 2027లో విడుదల లేకుంటే అప్పుడు కూడా ఏడాది కాలంలో ఎన్టీఆర్ మూడు సినిమాలు విడుదల అయినట్లు అవుతుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పవచ్చు.