అమరావతి – మన తెలంగాణ న్యూస్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టంగుటూరు టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న కారును బలంగా లారీ ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న వారు బెంగళూరు నుంచి అద్దంకి వస్తుండగా టంగుటూరు టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.