షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 29 నవం 2026, 12:14 సా.
క్రైమ్ వార్తలు

ఝార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 29 నవం 2026, 12:14 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
ఝార్ఖండ్‌లో  రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి!

రాంచీ – మన తెలంగాణ న్యూస్‌డెస్క్: ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామ్‌గఢ్ జిల్లా పైన్కీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది మృతి చెందగా, మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని నలంద జిల్లా జంఘార్‌కు చెందిన వారు కారులో రాజరప్పలోని మా చిన్న మస్తిక ఆలయ దర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో రామ్‌గఢ్ జిల్లా పైన్కీ వద్ద కారు ఓ వాహనాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికుడిని చికిత్స నిమిత్తం రామ్‌గఢ్ సదర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా బిహార్‌లోని నలంద జిల్లా జంఘార్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

#క్రైమ్వార్తలు
రాంచీ – మన తెలంగాణ న్యూస్‌డెస్క్: ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామ్‌గఢ్ జిల్లా పైన్కీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కారులో…