Navodayam, 28 నవంబర్ 2026: మన తెలంగాణ న్యూస్డెస్క్: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తల్లాడ మండలం రామంజరం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై వెళ్తున్న ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, మరో 11 మందికి తీవ్రగాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు!