షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 27 నవం 2026, 10:21 ఉద.
తాజా వార్తలు

వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండియన్ యూట్యూబర్

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 27 నవం 2026, 10:21 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండియన్ యూట్యూబర్

World Record : ప్రముఖ స్టాండప్ కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనా (Samay Raina) డిజిటల్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా తన యూట్యూబ్ ఛానల్‌లో ఏకంగా 10 లక్షల (1 మిలియన్) మంది పెయిడ్ ఛానల్ మెంబర్స్‌ను సాధించిన మొట్టమొదటి యూట్యూబర్‌గా ఆయన అరుదైన వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా యూట్యూబ్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. సాధారణ సబ్‌స్క్రైబర్లు కాకుండా, డబ్బులు చెల్లించి ఛానల్ మెంబర్‌షిప్ తీసుకునే వారి సంఖ్య పది లక్షలకు చేరుకోవడం గ్లోబల్ స్థాయిలో ఒక సంచలనంగా మారింది.

చెస్ నుంచి కామెడీ వరకు.. వివాదాలను దాటి ఘనమైన రీఎంట్రీ

కరోనా సమయంలో చదరంగం (చెస్) సంబంధిత వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్‌లతో తన యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించిన సమయ్ రైనా, అనతికాలంలోనే యువతకు చేరువయ్యారు. ఆ తర్వాత ఆయన రూపొందించిన ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (India’s Got Latent – IGL) షో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. అయితే, గతేడాది ఈ షో చుట్టూ నెలకొన్న కొన్ని వివాదాల కారణంగా సమయ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని కొంతకాలం విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఒడిదుడుకులన్నింటినీ అధిగమిస్తూ ఈ ఏడాది మరింత ఉత్సాహంతో రీఎంట్రీ ఇచ్చిన ఆయన, ఏకంగా ప్రపంచ రికార్డు స్థాయిలో అభిమానుల ఆదరణను పొందుతూ దూసుకుపోతున్నారు.

#తాజావార్తలు
World Record : ప్రముఖ స్టాండప్ కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనా (Samay Raina) డిజిటల్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా తన యూట్యూబ్ ఛానల్‌లో ఏకంగా 10…