న్యూఢిల్లీ, నవంబర్ 27: ఓటరు జాబితాల్లో అక్రమాలు, తప్పులను తొలగించేందుకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపైనే ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ’సర్” అనంతరం ప్రచురించిన తుది ఓటరు జాబితాలను విశ్లేషించగా పెద్ద సంఖ్యలో తప్పులు, డూప్లికేట్ నమోదులు బయటపడ్డాయి. ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో చేపట్టిన ప్రక్రియలోనే ఇన్ని లోపాలు ఉండటంపై స్వతంత్ర పరిశోధకుడు అమన్ భార్గవ ఆందోళన వ్యక్తం చేశారు. ‘డయాగ్రామ్ ఛేజింగ్’ సంస్థ తరఫున భార్గవ నిర్వహించిన విశ్లేషణలో ఉత్తరప్రదేశ్ ఓటరు జాబితాలో పలు అసాధారణ నమోదులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసిన లోపాలు
మహిళల పేర్ల తొలగింపులోనూ వ్యత్యాసం
ఓటరు జాబితాల నుంచి పేర్ల తొలగింపులో మహిళలపై ఎక్కువ ప్రభావం పడినట్లు ఈ విశ్లేషణ పేర్కొంది. 35 ఏళ్లలోపు మహిళల పేర్లు పురుషులతో పోలిస్తే రెండింతల స్థాయిలో తొలగించబడ్డాయని తెలిపింది. ముఖ్యంగా 25-29 ఏళ్ల మధ్య మహిళల పేర్లు పురుషుల కంటే 2.3 రెట్లు ఎక్కువగా తొలగించారు.పేర్ల తొలగింపునకు కారణాలుగా ‘చిరునామా మార్పు’ అని పేర్కొన్న సందర్భాలు మహిళల్లో ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 35 ఏళ్లలోపు మహిళలు పురుషులతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఈ కారణంతో జాబితా నుంచి తొలగింపునకు గురయ్యారని తెలిపింది. అలాగే, గతంలో నమోదైన ట్రాన్స్జెండర్ ఓటర్లలో 38 శాతం మందిని జాబితా నుంచి తొలగించగా, పురుషులు, మహిళల్లో ఈ శాతం 23గా ఉందని విశ్లేషణ పేర్కొంది.
కర్ణాటకలోనూ వేలాది తప్పులు
కర్ణాటక తుది ఓటరు జాబితాలోనూ అనేక లోపాలు ఉన్నట్లు పరిశోధన గుర్తించింది.
ఓటరు జాబితాల ప్రక్షాళనపై ప్రశ్నలు
ఓటరు జాబితాల్లో తప్పులను గుర్తించేందుకు సర్ చేపట్టినప్పటికీ, తుది జాబితాల్లోనూ ఇలాంటి లోపాలు కొనసాగడంపై పరిశోధకుడు ప్రశ్నలు లేవనెత్తారు. ఓటరు వివరాల నమోదు, బూత్ స్థాయి అధికారి (బీఎల్వో), ఎన్నికల అధికారుల పనితీరును బట్టి ఒక వ్యక్తికి ఎదురయ్యే పరిస్థితులు మారుతున్నాయని విశ్లేషణ అభిప్రాయపడింది. ఈ పరిశోధనలో ఎన్నికల సంఘం ప్రచురించిన పాత, కొత్త ఓటరు జాబితాల ఆధారంగా సరిపోల్చారు.