షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 27 నవం 2026, 9:37 సా.
హాకీ

హాకీ ఫైనల్లో భారత్

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 27 నవం 2026, 9:37 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
హాకీ ఫైనల్లో భారత్

మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 6-2 తేడాతో మలేసియాను ఓడించింది. భారత తరఫున దీపిక రెండు గోల్స్‌తో మెరిసింది. ముంతాజ్ ఖాన్ (10వ నిమిషం), నవ్‌నీత్ కౌర్ (18), దీపిక (25, 30), సునీలిత టొప్పో (33), ఇషిక (57) గోల్స్ సాధించారు. భారత్ సాధించిన ఆరు గోల్స్‌లో ఐదు పెనాల్టీ కార్నర్ల ద్వారానే రావడం విశేషం. మలేసియా తరఫున నూర్ అజర్, నూరామిరా జుల్కిఫ్లీ చెరో గోల్ చేశారు. మరో సెమీఫైనల్లో చైనా 1-0తో జపాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో భారత్-చైనా తలపడనున్నాయి.

#హాకీ
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 6-2 తేడాతో మలేసియాను ఓడించింది. భారత తరఫున దీపిక రెండు…